పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్ కు వరద ప్రవాహం మొదలైంది. ప్రస్తుతం 3 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 129 TMC లు కాగా 24 TMC ల నిల్వలున్నాయి.
కృష్ణానదిపై ఎగువన నిర్మించిన మొదటి రిజర్వాయర్ ఆల్మట్టి. దాని దిగువన ఉన్న నారాయణ పుర జలాశయానికి 8900 క్యూసెక్కుల నీరు వస్తోంది. దాని కింద ఉన్న తెలంగాణాలోని జూరాలకు 3300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
స్థానికంగా కురిసిన వానలతో శ్రీశైలానికి 2257 క్యూసెక్కులు వస్తున్నాయి. పెన్నానదిపై నెల్లూరులో నిర్మించిన సోమశిల రిజర్వాయర్ కు కూడా వారం రోజులుగా వరద నీరు వస్తోంది. 8100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరుతోంది