ఆమె స్నానం చేసినా చెమట పట్టినా చనిపోతుంది ? వింత జబ్బు ఏమిటంటే

ఆమె స్నానం చేసినా చెమట పట్టినా చనిపోతుంది ? వింత జబ్బు ఏమిటంటే

0
129

కొందరికి కొన్ని రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి.. అయితే వాటికి మందులు కూడా ఉండవు జీవితాంతం ఇలా ఇబ్బంది పడుతూనే ఉంటారు, అయితే ఎక్కడో లక్షలో ఒకరికి మాత్రమే ఇలాంటి అరుదైన వ్యాధులు వస్తూ ఉంటాయి, అయితే ఆమెకి వచ్చింది అలాంటి వ్యాధే అంటున్నారు వైద్యులు.

కొందరికి వారు తినే ఫుడ్ పడకపోతే అలర్జీ వస్తుంది, అరటి ఆపిల్ ఇలా కొన్ని రకాల పండ్లు తింటే కొందరికి అలర్జీ వస్తుంది. మాంసం చేపలు ఆకూకూరలు తింటే కొందరికి రాషెస్ వస్తాయి, అయితే ఈ యువతికి వాటర్ అలర్జీ, కన్నీరు కార్చినా ఆమెకు ప్రమాదమే ఆమె నీరు తాగినా ఆమె నోటిలో పుండ్లు వస్తాయి.

ఆమె స్విమ్మింగ్ పూల్లో దిగినా.. వర్షంలో తడిచినా ప్రాణాలు పోతాయి. అసలు ఆమె నెలకి ఓసారి స్నానం చేస్తుంది, అది కూడా శరీరంపై నీరు నిలువకుండా ఆమె జాగ్రత్తగా చేస్తుంది, శరీరంపై ఎర్రటి బొబ్బలు వచ్చేస్తాయట, అందుకే ఆమెని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు టెన్షన్ పడి చెమట పట్టినా శరీరం ఎర్రగా మారుతుంది… దీనిని ఆక్వాజెనిక్ ఆర్టికేరియా అనే అలర్జీ అంటారు.

ఆమె పేరు తెస్సా, ఆమెకి ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ విషయం తెలిసింది, తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే అనేక మందులు వాడినా ప్రయోజనం లేదు,దీంతో ఆమె ఇలా జీవితం నెట్టుకు వస్తోంది..ప్రపంచంలో 100 కంటే తక్కువ మందికి మాత్రమే ఈ సమస్య ఉంది, దీని కోసం ఇప్పటికీ మెడిసన్ వాడుతోంది ఆమె.