ఎండు పుల్లలకి వెళితే బెదిరించి రేప్ చేసిన దుర్మార్గుడు చివరకు

ఎండు పుల్లలకి వెళితే బెదిరించి రేప్ చేసిన దుర్మార్గుడు చివరకు

0
96

నీచులు దుర్మార్గులు అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారం చేస్తున్నారు.. ఎన్నికేసులు పెడుతున్నా ఎన్ని శిక్షలు వేస్తున్నా ఇలాంటి మానవ మృగాలలో మార్పు మాత్రం రావడం లేదు..
ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది.

ఇక్కడ ఓ గ్రామంలో పదేళ్ల బాలిక ఐదో తరగతి చదువుతోంది.. ఆమె తల్లిదండ్రులు వేరే చోట జిల్లాలో పనికి వెళ్లి అక్కడే ఉంటున్నారు, ఆమె నాయనమ్మ దగ్గర ఉంటోంది, ఈ సమయంలో యేబు అనే వ్యక్తి ఆమె పుల్లలకు వెళ్లిన సమయంలో ఆమెని బెదిరించాడు,

సాయంత్రం ఎండు పుల్లల కోసం గ్రామ శివారులోని చెరువు దగ్గరకు వెళ్లిన బాలికపై యేబు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె నాయనమ్మ ఇంటికి ఇంకా పిల్ల రాలేదు అని అంతా వెతికింది ఈలోపు ఆమె కేకలు విని అక్కడకు వెళ్లేసరికి అతను ఆమెని వదిలేసి పారిపోయాడు. దీంతో అతనిపై ఫిర్యాదు చేసింది ఆ బాలిక నాయనమ్మ, అతనిని వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు.