ఏపీ సర్కార్ మరో శుభవార్త..ఇకపై వారందరికీ రూ.5వేలు రూపాయలు మంజూరు

0
112

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటినుండి రాష్ట్రంలో ప్రసవించిన మహిళలకు ఆరోగ్య ఆసరా కిందా రూ.5వేలు ఇస్తామని తెలియజేసారు.

ఈ పథకం ఏ తరహా ప్రసవానికైనా వర్తిస్తుందని తెలియజేసాడు. దీనిపై అధికారులు దృష్టిపెట్టి వారం రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వాలని వారిని ఆదేశించాడు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మొదలుపెట్టి పేదప్రజలను సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపాడు. వైద్యులు సహజ ప్రసవాలను పెంచడానికి ప్రయత్నించి ప్రజల్లో అవగాహనా పెంచాలని తెలియజేసాడు.