ఏపీలో మరో జాబ్‌ మేళా..ఇంటర్ నుంచి డిగ్రీ అర్హతతో జాబ్స్..పూర్తి వివరాలివే..

0
46

ఏపీలో ఉన్న నిరుద్యోగుల కోసం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APSSDC) జాబ్‌మేళాలను నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా పలు ప్రైవేటు కంపెనీల సహకరంతో ఈ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జువెలరీ సంస్థ ఖజానాలో ఉన్న ఖాళీల కోసం ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీలు

ఈ జాబ్‌ మేళాలో భాగంగా సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ (20)

క్యాషియర్‌ (04)

అర్హతలు:

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఇంటర్‌/డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మహిళ/పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ ఈ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలను ఖజానా జువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 34-1-13, టెంపుల్‌ స్ట్రీట్‌, కాకినాడలో 24-03-2022లో నిర్వహిస్తారు.

అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 7396799788 నెంబర్‌ను సంప్రదించండి.