ఆమె పేరు స్పందన ఆమెది భీండి ప్రాంతం తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోవడంతో చూసేవారు లేరు, దీంతో కాస్త అందం ఉండటంతో ఓ మహిళ ఆమెని పని ఇప్పిస్తాను అని చెప్పి ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఓ బ్రోకర్ కి 25 వేలకు అమ్మేసింది, ఆమె ఎన్నో కష్టాలు పడింది దాదాపు 19 ఏళ్ల వయసులో ఆమె అక్కడ వ్యభిచారం చేసింది.
ఇలా రోజు పదుల సంఖ్యలో పురుషులు ఆమెని వాడుకున్నారు, ఆమెకి కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చి అక్కడ ఇబ్బందులు పెట్టారు, అయితే అక్కడకు వచ్చిన ఓ యువకుడు విశ్వాస్ ఆమెని చూసి నువ్వు నచ్చావు పెళ్లి చేసుకుంటాను అన్నాడు.
సుఖం కోసం వచ్చేవారిని చూశాను నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటున్నావు ఎలా నమ్మాలి అంది.. చివరకు అతని మాటలు నమ్మి అతనితో వచ్చేసింది.. ఇప్పుడు ఆమె తన గతాన్ని మర్చిపోయింది, అంతేకాదు భర్త ఎంతో బాగా చూసుకుంటున్నాడట, ఇక వారికి పిల్లలు వద్దు అనుకుని ఓ అనాధ ఆశ్రమం నుంచి సంగీత – శరత్ అనే ఇద్దరు పిల్లలని తెచ్చి పెంచుకుంటున్నారు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని తన అనుభవాలని ఫీచర్ అనే శీర్షికలో ఆమె తన గురించి తెలిపింది.