టెట్ కు అప్లై చేయాలా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

0
122

తెలంగాణ టీచర్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ కు మార్చి 26 నుంచి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. టెట్ పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నారు. 27న రిజల్ట్ ను విడుదల చేయనున్నారు.

ఎలా అప్లై చేయాలంటే..

Step 1: మొదటగా అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు రూ.300ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

Step 2: ఇందుకోసం http://tstet.cgg.gov.in/ ఈ లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step3: అందులో Online Payment ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 4: అనంతరం పేరు, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, మొబైల్ నంబర్, తండ్రి, తల్లి పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Step 5: ఫీజు చెల్లించిన అనంతరం అభ్యర్థులకు జర్నల్ నంబర్ కేటాయించబడుతుంది. ఈ నంబర్ ను అప్లికేషన్ ఫామ్ నింపడానికి తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.

Step 6: ఇంకా పైన ఫొటోలో సూచించిన విధంగా మీ ఫొటోగ్రాఫ్, సిగ్నేచర్ కు సంబంధించిన స్కానింగ్ కాపీని సిద్ధంగా ఉంచుకోవాలి.

Step 7: అనంతరం tstet.cgg.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 8: తర్వాత online application Form ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 9: తర్వాత మీ జర్నల్ నంబర్(Journal Number) మరియు Date Of Birth, Date Of Payment ను మోదు చేయాల్సి ఉంటుంది.

Step 10: అనంతరం కాప్చా(CAPTCHA)ను నమోదు చేయాలి.

Step 11: తర్వాత ఆ వివరాలను సరి చూసుకుని ‘‘Verify & Next’’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 12: తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అనంతరం కావాల్సిన వివరాలను నమోదు చేయాలి. ఫొటో అప్ లోడ్ చేయాలి.

Step 13: తర్వాత Save&Next ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 14: తర్వాత “Paper and Qualification” విభాగంలో కావాల్సిన అన్ని వివరాలను నమోదు చేయాలి. తర్వాత Save&Next ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 15: అనంతరం “X-Class and Previous TET details” విభాగంలో వివరాలను నమోదు చేయాలి.

Step 16: తర్వాత “Save & Preview” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 17: ప్రివ్యూలో వివరాలను సరిచూసుకుని సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 18: తర్వాత Candidate ID జనరేట్ అవుతుంది. ఈ ఐడీ మీ రిజిస్టర్డ్ నంబర్ కు SMS ద్వారా వస్తుంది.

Step 19: అనంతరం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ విషయంలో ఏమైనా సందేహాలుంటే ఈ నెల 26 నుంచి జూన్ 12 వరకు -8121010310, 8121010410 నంబర్లను సంప్రదించవచ్చు.

టెక్నికల్ సమస్యలు ఉంటే.. 040-23120340, 040-

23120433 నంబర్లను సంప్రదించవచ్చు.

టెట్ కు సంబంధించి ఇతర ఏమైనా సందేహాలుంటే 8341371079,8341831080 నంబర్లను సంప్రదింవచ్చు.

అభ్యర్థులు జూన్ 6 నుంచి అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.