1000 సంవత్సరాల నాటి కోడిగుడ్డును కనుగొన్న పురావస్తు శాస్త్రజ్ఞులు – ఎక్కడంటే

Archaeologists have discovered a 1000-year-old egg

0
78

పురావస్తు తవ్వకాల సందర్భంగా అనేక వస్తువులు బయటపడటం జరుగూతూనే ఉంటుంది. అయితే తాజాగా ఇలాగే జరిగింది ఇజ్రాయెల్ లో. దాదాపు 1000 ఏళ్ల నాటిదిగా భావిస్తున్న కోడిగుడ్డును పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. అసలు పది రోజులు అయితేనే గుడ్డు పోతే స్మెల్ వస్తుంది. అలాంటిది వెయ్యి సంవత్సరాల గుడ్డు ఎలా ఇలా ఉంది అని చాలా మందికి ఆశ్చర్యం అనిపిస్తోంది.

అంతేకాదు ఇన్ని సంవత్సరాలు అయినా ఆ గుడ్డు ఇప్పటికీ సరైన స్థితిలోనే ఉంది.
యావ్నే పట్టణ శివార్లలోని కందకం నుంచి దీనిని బయటకు తీశారు.
ఇది ఇస్లామిక్ యుగం నాటిది అని ప్రాధమిక పరిశోధనలో తెలుసుకున్నారు.

అయితే చిన్న చిన్న పగుళ్లు తప్ప ఇప్పటీకీ ఈ గుడ్డు చెక్కుచెదరకుండా ఉంది అని తెలియచేశారు పరిశోధకులు. ఇలా గుడ్డు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిని జాగ్రత్తగా భద్రపరిచి పరిశోధన చేస్తామంటున్నారు.