ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమ్ లకు విపరీతంగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యువత ఎక్కువ సమయాన్ని ఆన్‌లైన్ గేమ్‌లకు కేటాయిన్నారు. కొన్ని రకాల ఆన్‌లైన్ గేమ్స్‌తో డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కొన్ని రకాల ఆన్ లైన్ గేమ్స్‌లను చట్టబద్ధం చేసి బెట్టింగ్ నిర్వహించుకోవచ్చని కోర్టులు స్పష్టం చేశాయి. అయితే నైపుణ్యానికి సంబంధించిన గేమ్‌లలో గెలవాలంటే వ్యక్తి తన మేదస్సును పదును పెట్టాల్సి ఉంటుందని..అదే ఇతర గేమ్స్‌లో గెలవాలంటే అది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని చట్టం పేర్కొంది.
ఫాంటసీ గేమ్స్ పూర్తిగా ఆటలో నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. దీంతో వీటిని కూడా చట్టబద్ధంగా అనుమతించారు. గేమింగ్ ల నిపుణుడు వైభవ్ కక్కర్ఫాంటసీ క్రీడలకు సంబంధించిన రూల్స్ వివరించారు. ఫాంటసీ క్రీడలు ఆడేందుకు ప్రజలు లైసెన్స్ పొందవలసి ఉంటుందని తెలిపారు. ఫాంటసీ గేమ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో బెట్టింగ్ 30% ఫ్లాట్ రేట్‌తో పన్ను విధిస్తారట. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 10,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రైజ్ మనీని మీ ఖాతాలో క్రెడిట్ చేయడానికి ముందు 30% టీడీఎస్‌ని తీసివేస్తారని వివరించాడు.