30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవట!

Are you getting married after 30 years? Except for these issues though!

0
156

వివాహం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, నచ్చిన వయసులో వివాహం చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటుండగా మరికొంతమంది 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. దీనికి కారణాలు చాలా ఉన్న కొన్ని సమస్యలు మాత్రం తప్పవు.

కొంత మంది ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటారు. కానీ మరికొంతమంది ఉద్యోగం వచ్చి బాగా సంపాదించాక అప్పుడు పెళ్లి చేసుకుంటారు. మరికొంత‌మంది త‌మ కుటుంబం కోసం త్యాగాలు చేసి పెళ్లి చేసుకోకుండా 40 ఏళ్ల వ‌ర‌కూ అలాగే ఉండిపోతారు. కానీ వారి కుంటుంబంలోని ఒక్క‌క్క‌రూ పెళ్లి చేసుకుని వెళ్లిపోవ‌డంతో ఒంటిరిగా మిగిలిపోతారు. అయితే చాలామంది ఈ మధ్య కాలంలో 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక వాటి కోసం చూస్తే.. 30 తర్వాత పెళ్లి చేసుకున్న వారిలో పూర్తి స్పష్టత వస్తుంది. వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలని వీళ్ళు భావిస్తారు. దీనితో వైవాహిక జీవితం పై శ్రద్ధ పెట్టడం లో ఇబ్బంది వస్తుంది.

అలానే 30 తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళల్లో ఎక్కువగా ఎదురయ్యే మరో సమస్య ఏమిటంటే భార్య లేక భర్త పై తక్కువ ఫోకస్ పెడతారు. ఎక్కువగా వాళ్ళ ఫోకస్ అంతా కూడా కెరియర్ మీదనే ఉంటుంది. అలానే భవిష్యత్తులో ఏం చేయాలి..? ఎలా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలని పట్టించుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతారు.

అయితే సాధారణంగా పెళ్లి అనేది వ్యక్తి యొక్క పర్సనల్ ఛాయిస్. ఎప్పుడు ఏం చేయాలి అనేది ప్రతీ ఒక్కరికీ కూడా క్లారిటీ ఉంటుంది. అందుకని మనం ఎవరికీ చెప్పకూడదు. కాకపోతే 30 తర్వాత పెళ్లి చేసుకుంటే మాత్రం ఈ చిన్న ఇబ్బంది తప్పవు.