మొబైల్ ​అతిగా వాడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి

0
113

ప్రస్తుత రోజుల్లో ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫోన్ లేకుండా నిమిషం కూడా వుండలేకపోతున్నాం. అంతలా ఫోన్​లకు బానిసలుగా మారిపోయాం. అయితే ఫోన్​ను దూరం పెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మరి ఫోన్ కు దూరంగా ఉండాలంటే ఈ సూచనలు పాటించండి.

ఫోన్‌ చేతికి అందేంత దూరంలో పెట్టొద్దు.

గదిలో ఓ మూలన దూరంగా పెట్టండి.

ముఖ్యంగా..నిద్ర లేవగానే ఫోన్‌ని స్క్రోల్‌ చేస్తూ కూర్చునే వారికి ఇది బాగా పని చేస్తుంది. రోజులో ఏవైనా నిర్ణీత సమయాల్లోనే (పాకెట్స్‌ ఆఫ్‌ టైమ్‌) గ్యాడ్జెట్‌లను యాక్సెస్‌ చేసేలా షెడ్యూల్‌ చేసుకుంటే మంచిది.

ఫోన్‌ మెసేజ్‌లకు ఒకటి.. వాట్సాప్‌ లాంటి టెక్స్ట్‌ మాధ్యమాలకి ఇంకొకటి.. సోషల్‌ ఫ్లాట్‌ఫామ్‌లకు మరోటి.. ఇలా నోటిఫికేషన్‌ సౌండ్‌లు, బీప్‌లు వస్తూనే ఉంటాయి. విన్నప్పుడల్లా ఎవరో ఏదో పంపించి ఉంటారని ఆలోచించడం.. ఫోన్‌ అందుకోవడం.. ఇలా జరగకుండా ఉండాలంటే? ముఖ్యమైన నోటిఫికేషన్స్‌ని మాత్రమే ఆన్‌లో ఉంచి, మిగతా అన్నింటినీ మ్యూట్‌ చేయడం మంచిది. దీంతో ఫోన్‌పై ధ్యాస కాస్త తగ్గుతుంది.