బక్రీద్ స్పెషల్ – లక్షలు పలికిన పొట్టేళ్లు వీటి ధర ఎంతంటే

Bakra eid specail - Sheeps cost in lakhs

0
144

బక్రీద్ పండుగ రోజున ముస్లిం సోదరులు మేకలను పొట్టేళ్లను కొంటారు. ప్రత్యేక విందులు ఇస్తారు. అయితే ఈ సమయంలో మేకలు, పొట్టేళ్లు కొంచెం రేటు ఎక్కువ పలుకుతాయి. ఎంత రేటు ఉన్నా పండుగ వేడుకల కోసం తప్పనిసరిగా వాటిని కొనుగోలు చేస్తారు. తాజాగా ఓ వ్యక్తి బక్రీద్ వేడుకల కోసం రెండు పొట్టేళ్లకు లక్షలాది రూపాయలు వెచ్చించాడు. వీటి కోసం లక్షలు ఖర్చు చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి.

బక్రిద్ వేడుకల కోసం ఉత్తర ప్రదేశ్ లక్నోలో ఒక జత పొట్టేళ్లను అమన్ అనే వ్యక్తి రూ .4.5 లక్షలు ఖర్చు చేశారు. గోమతి నది సమీపంలో ఉన్న మార్కెట్లో ఈ రెండు పొట్టేళ్లు ఇంత ఖరీదు పెట్టి కొన్నాడు. ఒకటి 170 కేజీలు ఉంటే, మరొకటి 150 కేజీల బరువు ఉంది. వీటి వయసు రెండు సంవత్సరాలు. వీటి రోజువారీ ఆహారం సుమారు 600 రూపాయలు ఖర్చవుతుంది.

వీటిని నిత్యం జీడిపప్పు, బాదం, పిస్తా, స్వీట్లు, జ్యూస్ లు ఇస్తారు. మంచి మందులు వాడతారు. రెండు పూటలా స్నానం చేయిస్తారు. వాకింగ్ చేయిస్తారు అందుకే ఇవి ఇంత బలంగా ఉంటాయి. ఇంత రేటు పలకడానికి కారణం ఇదే అంటున్నారు మార్కెట్ వ్యాపారులు.