మహిళలకు రక్షణ లేకుండా పోతోంది, కొందరు నమ్మిన వారు బంధువులు కూడా కన్నేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, లాక్ డౌన్ వేళ బంధువుల ఇంటికి వెళ్లి ఓ మహిళ చిక్కుకుపోయింది, దీంతో తల్లిదండ్రులు అక్కడే ఉండమని చెప్పడంతో ఆమె ఇక్కడ కలకత్తాలోని తన బంధువుల ఇంటిలో ఉండిపోయింది.
ఈ సమయంలో బంధువులు బయటకు వెళ్లిన సమయంలో వారి కుమారులు ఆమెకి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు.మద్యం మత్తులో ఉన్న యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు.. అంతేకాకుండా ఒకరు అత్యాచారం చేస్తుండగా.. మరో వ్యక్తి ఆ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. దీంతో ఆమెని అత్యంత దారుణంగా హింసించారు.
అంతేకాదు ఈ దారుణం బయట చెబితే వీడియోలు లీక్ చేస్తామని బెదిరించారు.. దీంతో జరిగిందంతా పోలీసులకు చెప్పింది ఆ బాధితురాలు… పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు, వారి బంధువులు కూడా వారిని వదిలిపెట్టవద్దు అని తెలిపారు, ఆ ఇద్దరు యువకులు పరార్ అయ్యారు.