బీ అలర్ట్..రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు

0
106

తెలంగాణ ప్రజలకు అలెర్ట్. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తూర్పు పశ్చిమ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశా మీదుగా.. సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వివరించింది. అంతర్గత ఒడిశా, దాని పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా, దాని పరిసరాలలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది.

ఇప్పటికే వర్షాలు పడడంతో రైతులు జోరుగా విత్తనాలు నాటుతున్నారు. నారుమళ్లను సిద్ధం చేసుకొని నార్లు కూడా పోస్తున్నారు. ఇక ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణ లోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలు కురవనున్న క్రమంలో రైతులు నారుమళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.