లక్ష్మీకాంత్ యాదవ్ కు ఉత్తమ వైద్య సేవా అవార్డు

Best Medical Service Award to Laxmikant Yadav

0
106

తెలంగాణ: హైదరాబాద్ రవీంద్రభారతిలో బియాండ్ లైఫ్ ఫౌండేషన్ వారు ఫ్రంట్ లైన్ పాండమిక్ వారియర్ 2021 అవార్డ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జహీరాబాద్ ప్రముఖ ఎంబిబిఎస్ డాక్టర్ లక్ష్మీకాంత్ యాదవ్, కోవిడ్ పండమిక్ పరిస్థితిలో వైద్యం అందించడంతో పాటు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంటూ కోవిడ్ రోగులకు బాసటగా నిలిచారు. దీనితో వేలాది రోగుల ప్రాణాలను కాపాడడంతో కోవిడ్ వారియర్ గా గుర్తించి అవార్డ్ అందజేశారు.

ఇన్నిరోజులు డాక్టర్ వృత్తి లో కోవిడ్ రోగులకు సలహాలు, సూచనలు ఇవ్వడం తనకు తృప్తినిచ్చిందన్నారు. ఇకపై కూడా అలాంటి సేవలతోనే నిత్యం అందుబాటులో ఉండి ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్షమని విపత్కర పరిస్థితిలో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతోనే హాస్పత్రికి వొచ్చే రోగులకు సేవలు అందించనన్నారు డాక్టర్ లక్ష్మీకాంత్ యాదవ్.

కోవిడ్ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం సేవలు మరువలేనివి. కరోనా కారణంగా మనుషుల్లో మార్పు రావడం శుభపరిణామంగా భావించారు. కరోనా టైం లొనే కుండ నిత్యం జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి రోగాలైన తరిమేయొచ్చన్నారు. డాక్టర్ లక్ష్మీకాంత్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో తన తల్లిదండ్రులకు అవార్డ్ అందజేశారు నిర్వాహకులు.