రైతులకు బిగ్ అలెర్ట్..మరో రెండు రోజుల్లో ముగియనున్న గడువు

0
108
Pm Kisan samman

ఇప్పటికే రైతుల కోసం మోడీ సర్కార్ ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న పథకం మీద ఆధారపడి నివసించే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా 6000 నగదు అందుతుంది.

అయితే ఇప్పటివరకు పదకొండు విడతలుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది. విడతల వారిగా రూ. 2000 అందిస్తుంది. అర్హులైన రైతులకు జూలై 31న రాబోయే 12వ విడతలో రూ.2000 సాయం అందుకోవచ్చని భావిస్తున్నారు. పీఎం కిసాన్‌ లబ్దిదారుల జాబితాలో అర్హులైన ఎవరైనా పేరు లేకుండా ఈ ప్రయోజనాన్ని కోల్పోతారు.

ఈకేవైసీ లేకుంటే 12వ విడత డబ్బులు రావు

ఒక వేళ మీరు ఈ స్కీమ్‌ ద్వారా డబ్బులు పొంది ఈకేవైసీ పూర్తి చేసుకోనట్లయితే 12వ విడత మీ ఖాతాలో జమ జమ కావని గుర్తించుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదేపదే రైతులకు సూచించింది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ఆగస్టు 31తో గడువు పూర్తి కానుంది. తర్వాత పెంచుతుందా ..? లేదా అనేవి షయం ఇంకా తెలియదు. ఒక వేళ ఎవరైనా రైతులు ఈకేవైసీ చేసుకోనట్లయితే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

కాగా, ఇది వరకు ఈకేవైసీ చేసుకునేందుకు జూలై 31 గడువు ఉండేది. తర్వాత ఆ గడువును ఆగస్టు 31 వరకు పెంచింది. ఇప్పుడు ఈ గడువు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈకేవైసీ చేసుకోలేని రైతులు వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించింది కేంద్రం. మీరు ఇంట్లో ఉండి కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.

ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం ఎలా..?

1. ముందుగా పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

2. ఆ వెబ్‌సైట్‌లో కుడివైపు కనిపించే ఈ-కేవైసీపై క్లిక్‌ చేయాలి.

3. అందులో ఆధార్‌ నెంబర్‌, కనిపించే కోడ్‌ను నమోదు చేయాలి.

4. ఆధార్‌తో లింకైన మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

5.  పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేయాలి.

6. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.