ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్..రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు

0
113

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు విరివిగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.  ఆదివారం రోజున ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్‌ వరకు సరాసరి సముద్ర మట్టం 0.9గా ఉన్నట్టు తెలిపింది.

దీని ఫలితంగా రానున్న మూడు రోజులపాటు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.