ప్రజలకు బిగ్ అలెర్ట్..తెలంగాణ వ్యాప్తంగా వర్షాలే వర్షాలు!

0
124

తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. ఇవ్వాళ, రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే గత 2,3 రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాబోయే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన  ప్రకారం..నేడు వనపర్తి, నాగర్ కర్నూల్ లో, రేపు నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాపాతం ఇలా నమోదైంది.

వికారాబాద్ జిల్లా బోరంస్ పేటలో 114.6 మి.మి
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండలో 95.3 మి.మీ
జోగులాంబ గద్వాల గట్టు 93.3 మి.మీ
కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో 90.9 మి.మీ
హైదరాబాద్ తిరుమలగిరిలో  87.3 మి.మీ
రంగారెడ్డి జిల్లా నందిగామలో 78.5 మి.మీ