బర్త్ డే పార్టీకి ప్రియుడు రానందుకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య…

బర్త్ డే పార్టీకి ప్రియుడు రానందుకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య...

0
90

దేశంలో ఒక వైపు కరోనా కేసులు ఎక్కువ అవుతుంటే మరో వైపు ఆత్మహత్యలు హత్యా కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి… తాజాగా బర్త్ డే పార్టీకి ప్రియుడు రానందుకు మహిళా కానిస్టేబుల్ ఆత్మ హత్య చేసుకుంది… పూర్తి వివరాలు ఇలా ఉన్నారు… తమిళనాడుకు చెందిన శివ కుమార్తె శరణ్య పెరంబూరు రైల్వే స్టేషన్ లోకానిస్టేబుల్ గా పని చేస్తుంది.. కరోనా భధ్రత కోసం ఆమెను ఎస్ పల్లేరు పోలీస్టేషన్ కు బదిలీ చేశారు..

అక్కడ సాయుద బలగాలలో పని చేస్తున్న ఏలుమలై అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ పరియం కాస్త కొన్నిరోజులకు ప్రేమగా మారింది.. ఈ క్రమంలో ఏలుమలై బర్త్ డే రోజు వచ్చింది.. శరణ్య డ్యూటీని త్వరగా పూర్తి చేసుకుని పోలీస్ క్వార్టర్ లో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది.. ఏలుమలైకి కరెక్ట్ గా 6 గంటలకు రావాలని చెప్పింది.. అయితే ఏలుమైకు అధికారులు పేదలకు ఆహారం అందించేప్రాంతలలో విధులు కేటాయించారు…

దీంతో ఆయన చెప్పిన టైంకు రాలేకపోయాడు దీంతో ఏలుమలై 9 గంటలకు ఫోన్ చేశాడు ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె మిత్రురాలు రాజేశ్వరికి ఫోన్ చేశాడు.. ఆమె ఇంటికి వెళ్లి చూస్తే శరణ్య ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకుంది… దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…