బ్రేకింగ్ – ఒకే కాన్పులో 9 మంది సంతానం – రికార్డ్

బ్రేకింగ్ - ఒకే కాన్పులో 9 మంది సంతానం - రికార్డ్

0
95

ఒకే కాన్పులో కవలలకు జన్మనివ్వడం గురించి విన్నాం అయితే ముగ్గురు కూడా పుట్టడం చూశాం, ఇక నలుగురు పిల్లలు ఒకే కాన్పులో జన్మించారు అనే వార్తలు విన్నాం, అయితే ఓ మహిళ ఏకంగా ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. దీంతో ఇది మామూలు వింత కాదు వింతలకే వింత అంటున్నారు చూసిన వారంతా. ఇదిమాలీలో జరిగింది.

 

హలీమా సిస్సి 9 మందికి సంతానానికి ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ఇక ఇద్దరు వైద్యులు ఆమెకి డెలివరీ చేశారు, ఇది వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి, అయితే ఈ కేసులో ఇంకా విచిత్రాలు ఉన్నాయి.

పుట్టిన 9 మంది సంతానంలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అ‍బ్బాయిలు ఉన్నారు.

 

ఇక అందరూ క్షేమంగా ఉన్నారు, స్కానింగ్ చేసిన సమయంలో ఆమెకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అని చెప్పారు.. సుమారు 7 పిల్లలు అని చెప్పారు అయితే ఇప్పుడు 9 మంది సంతానం వచ్చారు. ఇదంతా సిజేరియన్ ద్వారా చేశారు.