CBSE: 10వ తరగతి టర్మ్-1 ఫలితాలు విడుదల

0
104

CBSE 10వ తరగతి టర్మ్-1 ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే ఈ ఫలితాలను కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే విడుదల చేశామని, విద్యార్ధులకు సంబంధించిన మార్కు షీట్‌లను వారి వారి స్కూళ్లకు పంపించామని తెలియజేస్తూ బోర్డు ట్వీట్‌ చేసింది. 10వ తరగతి థియరీ పేపర్లకు సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్ధులు తమ స్కూళ్లను సంప్రదించాలని సూచించింది. (ఆన్‌లైన్‌ పద్ధతి)లో ఇంకా ఫలితాలు ప్రకటించలేదని, త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అలాగే 12వ తరగతి ఫలితాలను కూడా త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించింది.