దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సినిమా హీరోలు ఏం చేశారో చూడండి

దిశనిందితుల ఎన్ కౌంటర్ పై సినిమా హీరోలు ఏం చేశారో చూడండి

0
102

దిశ కేసులో చివరకు తీర్పు ఏం వస్తుందా అని అందరూ ఎదురుచూశారు, చివరకు కోర్టు తీర్పు కంటే వారి చావుని వారే కొని తెచ్చుకున్నారు. ఉదయం సీన్ ఆప్ అఫెన్స్ సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు.. దీంతో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు..దీంతో స్పాట్ లోనే నలుగురు మరణించారు. అయితే పోలీసుల ఎన్ కౌంటర్ పై తెలంగాణలోనే కాదు యావత్ భారత దేశం అంతా తెలంగాణ పోలీసులకి కితాబిస్తున్నారు.అలాగే నెటిజన్లు తెలంగాణ పోలీసులని మెచ్చుకుంటున్నారు.

దీనిపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ ఉదయం నిద్ర లేవగానే ఓ వార్తను విన్నాను. న్యాయం జరిగింది అని టాలీవుడ్ హీరో నాగార్జున ట్వీట్ లో వ్యాఖ్యానించారు. పోలీసులు చేసిన ఈ ఎన్ కౌంటర్ పై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను నాగార్జున పెట్టారు అంతేకాదు నాగార్జునతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ ఎన్ కౌంటర్, అలాగే దిశకు జరిగిన న్యాయం గురించి ట్వీట్లు పెట్టారు. అవి చూడండి.

ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసోడు అయి ఉండాలి అని నాని ట్వీట్ పెట్టారు
అత్యాచారం చేసిన తరువాత ఎంత దూరం పారిపోతారు. థ్యాంక్యూ తెలంగాణ పోలీస్ అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ పెట్టారు
ఒకప్పుడు నేను మరణదండనకు వ్యతిరేకం. కానీ కొంతకాలం క్రితం నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. అత్యాచారాలకు పాల్పడితే ఉరి తీయాలి అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. ఇక మంచు మనోజ్, తారక్, అల్లు అర్జున్, ఇలా ప్రముఖ సెలబ్రెటీలు హీరోలు అందరూ కూడా ఆమెకు న్యాయం జరిగిందంటున్నారు.