సజ్జనార్ ప్లాన్ అదిరింది నెటిజన్లు కితాబులు స్కెచ్ చూడండి

సజ్జనార్ ప్లాన్ అదిరింది నెటిజన్లు కితాబులు స్కెచ్ చూడండి

0
19

పోలీసులు తలచుకుంటే ఏమైనా చేస్తారు.. తాజాగా మరోసారి అది నిరూపించారు.. దుర్మార్గులను శిక్షించడంలో కచ్చితంగా ముందుకు వెళతాము అని తెలియచేశారు పోలీసులు, దిషని అత్యతం దారుణంగా చంపిన ఆ నలుగురిని పోలీసులు కాల్చి ఎన్ కౌంటర్ చేశారు అనే వార్త ఉదయం అందరికి తెలిసింది. పోలీసులు చేసింది మంచి పని అని అందరూ ప్రశంసిస్తున్నారు..అయితే మొత్తం కర్త, కర్మ, క్రియ, సైబరాబాద్ సీపీ సజ్జనార్ కే ఇవ్వాలి అంటున్నారు దానికి కారణం కూడా ఉంది.. గతంలో ఆయనకు ఉన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది .

2008 డిసెంబర్లో వరంగల్లో ఇంజనీరింగ్ చదువుతున్న స్వప్నిక తన స్నేహితురాలు ప్రణీతతో కలిసి స్కూటీపై కాలేజీకి వెళుతోంది..మార్గ మధ్యలో మాటు వేసిన శ్రీనివాస్ అనే యువకుడు స్వప్నికపై యాసిడ్తో దాడి చేశాడు, దీంతో ఈ కేసు దేశంలో సంచలనం అయింది. ఆనాడు వైయస్ ఆర్ సీఎంగా ఉన్నారు సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్నారు.

వెంటనే వీరిని ఉరి తీయాలి అని డిమాండ్ వచ్చింది.. ఈ సమయంలో నిందితుడు శ్రీనివాస్ మరో ఇద్దరు నిందితులు మొత్తం ముగ్గురిని సీన్ ఎలా జరిగింది అని తెలుసుకునే క్రమంలో బయటకు తీసుకువచ్చారు.. వారి మారణాయుదాలతో తమపై దాడి చేయబొయారని ఆ సమయంలో వారిని కాల్చేశామని పోలీసులు చెప్పారు.. ఆనాడు అలా ఎన్ కౌంటర్ జరిగితే నేడు ఇలా ఎన్ కౌంటర్ జరిగింది.దీంతో వరంగల్ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. అప్పుడు అక్కడ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు ఇక్కడ సీపీగా సజ్జనార్ ఉన్నారు.