చైనాని మళ్లీ వణికిస్తున్న కరోనా – కొత్త కేసులతో విమానాలు రద్దు

China flights cancel due to Corona cases increased

0
37

 

2019 డిసెంబర్ నుంచి ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది.. 2020 జూన్ వరకూ చైనాని దారుణంగా కన్నీరు పెట్టించింది…ఆరు నెలలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి చాలా దేశాలు, ఇక ఈ వైరస్ అన్నీ దేశాలు చుట్టేసింది 2020 చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉన్నాయి, ఇక 2021 నుంచి టీకాలు అందుబాటులోకి వచ్చాయి.. అయితే మళ్లీ కొన్ని దేశాల్లో కరోనా కోరలు చాచుతోంది. భారత్ లో సెకండ్ వేవ్ ఎంత దారుణంగా విజృంభించిందో తెలిసిందే.

అయితే కరోనా చైనాలోశాంతించింది అని అందరూ అనుకుంటున్న వేళ చైనాలోని గాంగ్డాంగ్ ప్రావిన్సులో మళ్లీ కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. అధికారులు అప్రమత్తమై వెంటనే గాంగ్జూ నగర విమానాశ్రయానికి వచ్చే సుమారు 660 విమానాలను రద్దు చేశారు.

గాంగ్జూ నగరంతో పాటు ఫోషన్ నగరంలోనూ కొత్తగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. సినిమాలు, జిమ్లు, బార్లను రద్దు చేశారు. ఎవరైనా ఈ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలి అంటే అప్పటి సమయంలో చేయించుకున్న కోవిడ్ టెస్ట్ నెగిటీవ్ రిపోర్ట్ చూపించాలి.. గాంగ్జూలో కొత్తగా 10 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.