తెలంగాణ ప్రజలకు చల్లని కబురు..అదేంటంటే?

0
88

తెలంగాణాలో భానుడు భగ భగ మండుతున్నాడు. ఎండల దాటికి జనాలు బయటకు వెళ్ళడానికే జంకుతున్నారు. పూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. ఇప్పుడు ఈ రేంజ్ లో ఎండలు దంచితే ఏప్రిల్, మే మాసాల్లో భానుడి ప్రతాపం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చెమటలు పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈ రోజు నుంచి రేపు, ఎల్లుండి తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం వెల్లడించింది. నేడు, ఎల్లుండి రాష్ట్రంలో తేలిక పాటి నంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తామని వెల్లడించింది. రేపు మాత్రం రాష్ట్రంలో పొడివాతావరణ నెలకొని ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

తూర్పు విదర్భ పరిసర ప్రాంతా నుంచి తెలంగాణ మీదుగా దక్షిన తమిళనాడు వరకు సముద్రమట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు ఇది బలహీన పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా మీదుగా.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.