తమ బిడ్డల్లా విద్యార్దులని చూసుకోవాల్సిన టీచర్లు ప్రొఫెసర్లు కొందరు విధ్యార్దినులపై లైంగిక దాడులకి పాల్పడుతున్నారు.. తమ దగ్గర చదువుకునే వారిపై లైంగిక దాడికి దిగుతున్నారు, తాజాగా ఇలాంటి దారుణానికి పాల్పడిన ప్రొఫెసర్ కి బుద్ది చెప్పింది ఓ విధ్యార్దిని.
ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హరీశ్ అనే వ్యక్తి ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. అక్కడే చదువుతున్న ఓ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఫోన్లు, చాటింగ్ ల తరువాత, తనను ప్రేమించాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె కేవలం సార్ గా చూసింది, కాని ఇతను తన వక్ర బుద్ది బయటపెట్టాడు
దీంతో ఆ ప్రొఫెసర్ ని ఆమె పక్కన పెట్టింది, దీంతో అతను ఆమెని ఫోన్ చేసి విసిగించేవాడు, ఆమె ఫోన్ తీయడం మానేసింది. ఆమె తనను దూరం పెడుతోందని భావించి, కోపం పెంచుకున్న హరీశ్, తనతో సన్నిహితంగా ఉన్న చిత్రాలను ఆమెకు, ఆమె కుటుంబీకులకు పంపించాడు. ఇవి సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది
దీంతో ఆ ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు పోలీసులు.