కరోనా టెస్ట్ చేయించుకున్న పకోడి షాక్ యజమాని – పాజిటీవ్ అని చెప్పగానే అతని సమాధానం విని షాక్

కరోనా టెస్ట్ చేయించుకున్న పకోడి షాక్ యజమాని - పాజిటీవ్ అని చెప్పగానే అతని సమాధానం విని షాక్

0
100

వందల సంఖ్యలో వచ్చే కేసులు ఇప్పుడు వేలల్లో నమోదు అవుతున్నాయి.. ఏకంగా ఏపీలో రోజుకి ఇప్పుడు మూడు వేల కేసులు నమోదు అయ్యాయి.. దీంతో జనం బెంబెలెత్తి పోతున్నారు.. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో చాలా వేగంగా కేసులు పెరుగుతున్నాయి, అయితే చాలా మంది నిర్లక్ష్యంగా ఉండటం వల్ల కేసులు భారీగా పెరుగుతున్నాయి అంటున్నారు. ముఖ్యంగా చాలా మంది కరోనా సోకినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీని వల్ల పక్కవారికి కూడా పాజిటీవ్ వస్తోంది.

 

ఇష్టం వచ్చినట్లు రోడ్డుమీదకు రావడం మాస్క్ లేకుండా తిరగడం మాట్లాడటం వల్ల కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి.

3వేల 495 కేసులు నమోదయ్యాయి అంటే ఏపీలో కేసులు ఎలా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. పలాస–కాశీబుగ్గఓ పకోడి షాపు యజమాని కరోనా టెస్టు చేయించుకున్నారు.

 

ఇక పరీక్ష చేసిన తర్వాత ఆయనకు రిజల్ట్ చెప్పాలి అని మెడికల్ సిబ్బంది ఫోన్ చేశారు…అయితే ఆయన చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు… నేను పకోడి పిండి రుబ్బుతున్నా అయ్యాక వస్తాను అన్నాడు, దీంతో మెడికల్ సిబ్బంది అలర్ట్ అయి వెంటనే అతనిని అంబులెన్స్ లో తీసుకువెళ్లారు. ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే ఆ ఒక్క బండి నుంచి కొన్ని వందల మందికి ఈ కరోనా సోకుతుంది అంటున్నారు వైద్యులు.