కొందరు ఖైదీలు జైలుకి వెళ్లి శిక్ష అనుభవించినా మారరు, తాజాగా ఓ ఖైదీని కోర్టుకు తీసుకువెళ్లారు జైలు నుంచి, ఈ సమయంలో కుటుంబ సభ్యులు కోర్టు వాయిదా అయిన తర్వాత కుమారుడ్ని చూసేందుకు దగ్గరకు వచ్చారు.. అతనికి తినే పదార్ధం ఏదో ఇవ్వబోయారు, అయితే అక్కడ ఉన్న కానిస్టేబుల్ వెంటనే అది వారికి ఇచ్చేసి ఇలా ఇవ్వకూడదు అని చెప్పాడు.
దీంతో సినియర్ ఆఫీసర్ కూడా అసలు ఇక్కడ మాట్లాడకూడదు ఇవ్వకూడదు అని చెప్పాడు.. దీంతో ఆ ఖైదీకీ కోపం వచ్చింది… ఆ కానిస్టేబుల్ ఆపడం వల్ల మా పేరెంట్స్ ఇచ్చిన బాక్స్ తీసుకోలేకపోయా అని బాధపడ్డాడు, అయితే కారు ఎక్కి సెంట్రల్ జైలుకువెళుతున్న సమయంలో అక్కడ వ్యానులో ఉన్న అదే కానిస్టేబుల్ తో వివాదం పెట్టుకున్నాడు… మిగిలిన ఖైదీలు కూడా అతని పక్కన ఉన్నారు.
అయితే చివరికి ఇద్దరూ తిట్టుకున్న తర్వాత ఖైదీ కానిస్టేబుల్ పై ఉమ్మి వేసాడు, దీంతో కోపంతో రగిలిపోయిన ఖాకీలు ఆరుగురు అతనిని చితక్కొట్టారు ఎంత పొగరు అని వారి స్టైల్ లో బాదుడు చూపించారు, అతని చర్యతో మరో కేసు కూడా ఫైల్ చేశారు.