దారుణం …ఫ్రెండ్ ని సూట్ కేస్ లో పెట్టి ఏం చేశాడో తెలిస్తే షాక్

దారుణం ...ఫ్రెండ్ ని సూట్ కేస్ లో పెట్టి ఏం చేశాడో తెలిస్తే షాక్

0
98

దేశంలో పూర్తిగా లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, ఈ స‌మ‌యంలో గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవ‌రైనా వ‌స్తే ఇక వారిని క్వారంటైన్ ని పంపిస్తున్నారు, ఇక ఆ గ్రామం వాళ్లు వ‌చ్చినా అక్క‌డ 14 రోజులు ఉండాల్సిందే, ఇక గేటెట్ క‌మ్యూనిటీస్ లో కూడా ఇలాగే ఉంటున్నారు అంద‌రూ.

మంగళూరులోని ఓ అపార్టుమెంటులో జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ యువ‌కుడు ఇంటిలోనే ఒంట‌రిగా ఉంటున్నాడు, ఈ స‌మ‌యంలో నా ఫ్రెండ్ మా ఇంటికి వ‌స్తాడు ప్లీజ్ అనుమ‌తి ఇవ్వండి అని అపార్ట్ మెంట్ అసోసియేష‌న్ వారిని కోరాడు, కాని వారు మాత్రం బ‌య‌ట‌వారు రావ‌డానికి వీలు లేదు అన్నారు.

దీంతో అతి తెలివి చూపించాడు, ఓ పెద్ద ట్రాలీ సూట్‌కేసులో తన మిత్రున్ని ఉంచి అపార్టుమెంటులోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంట‌నే అక్క‌డ సెక్యూరిటీ అలాగే మ‌రో ఇద్ద‌రు అంత బ‌రువు సూట్ కేస్ లో ఏమి ఉంది అయినా ఎక్క‌డ నుంచి తెచ్చావు అని యువ‌కుడ్ని ప్ర‌శ్నించారు, వెంట‌నే సూట్ కేస్ ఓపెన్ చేశారు, అందులో త‌న ఫ్రెండ్ ని కుక్కేశాడు, దీంతో పోలీసులు వ‌చ్చారు, ఆ ప్రాంత వాసుల‌కి క్ష‌మాప‌ణ చెప్పి త‌న ఫ్రెండ్ ని ఇంటికి పంపేశాడు.