దిషా కేసులో నిందితులు ఆమె ఫోన్ ఏం చేశారో తెలుసా

దిషా కేసులో నిందితులు ఆమె ఫోన్ ఏం చేశారో తెలుసా

0
94

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వెటర్నరీ డాక్టర్ దిషా కేసులో ఫోన్ కీలకంగా మారింది.. ఆమె ఫోన్ ఈ నిందితులు ఏం చేశారు తగులబెట్టారా, లేదా నీటిలో పడేశారా, బయట విసిరేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే దిశ ఫోన్లో ఆటోమెటిక్ వాయిస్ రికార్డ్ ఉందని భావించిన నిందితులు ఆ ఫోన్ను మాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ముఖ్యంగా నిందితుడు ఏ 1 ఆరీఫ్… నెంబర్ ఆమె తీసుకుంది.. దీనికి కారణం తను బైక్ పంక్చర్ వేయిస్తాను అని బండి తీసుకువెళ్లాడు.. ఈ సమయంలో అతని ఫోన్ నెంబర్ తీసుకుంది. అయితే ఈ కేసులో ప్రధానంగా పోలీసుకు దొరికిన సమాచారం కూడా అదే అయింది. ఆమె చివరగా ఎవరికి ఫోన్ కాల్ చేసింది అని చూస్తే ఆరీఫ్ నెంబర్ వచ్చింది,

ఈ సమయంలో తనతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆ ఫోన్ కాల్ కట్ అయిపోయింది, తర్వాత ఫోన్ స్విచ్చాప్ అయింది, అందుకే పోలీసులకు అనుమానం వచ్చి అతనిని అరెస్ట్ చేశారు, దీంతో ఈజీగా వీరు నలుగురు దొరికిపోయారు. మొత్తానికి ఆమె ఫోన్ కూడా విచారణలో భాగంగా ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది