దిష కేసులో నిందితులు – వెలుగులోకి మరిన్ని దారుణాలు

దిష కేసులో నిందితులు - వెలుగులోకి మరిన్ని దారుణాలు

0
99

శంషాబాద్లో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిషని అత్యంత దారుణంగా చంపేశారు నలుగురు నిందితులు.. తర్వాత డిసెంబర్ 6న సీన్ రీ కన్స్ట్రక్షన్ సమయంలో నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించగా.. కాల్పుల్లో చనిపోయారు.. తాజాగా వీరి గురించి కేసులు నడుస్తున్నాయి, అయితే వీరు చేసిన ఒక్కో మోసాలు బయటకు వస్తున్నాయి, దిశ ఘటనకు ముందు కూడా వీరు అనేక దారుణాలు చేశారు అని చెబుతున్నారు పోలీసులు.

తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో దిశ ఘటన తరహాలోనే జరిగిన అత్యాచార ఘటనల గురించి సైబరాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇలా జరిగిన 15 కేసుల విషయంలోనూ వారి ప్రమేయంపై పోలీసులు వారిని ప్రశ్నించారట. తాము 9 రేప్లు, మర్డర్లకు పాల్పడ్డామని అరీఫ్, చెన్నకేశవులు అంగీకరించారని వార్తలు వస్తున్నాయి,

అయితే వీరు ఇంత దారుణాలు చేసి చివరకు పాపం పండి పోలీసులకు చిక్కారు …లేకపోతే ఇలాంటి దారుణాలు ఇంకా చేసేవారు అని అంటున్నారు సమాజం.. దిష కేసు ముందు పోలీసులు నమోదు చేసి, సెల్ ఫోన్ కాల్ ప్రకారం తీగ లాగితే డొంక కదిలింది ..అదే తన సోదరికి కాల్ చేయకపోతే ఈ కేసు కూడా తెలిసేది కాదు అంటున్నారు పోలీసులు.

ఇలా దారుణాలకు పాల్పడ్డారని నిందితులే పోలీసులు ముందు ఒప్పుకున్నారట.. వీరిలో చిన్నతనం నుంచి నేర ప్రవ్రుత్తి పెరిగింది అని పోలీసులు వైద్యులు కూడా చెబుతున్నారు. హైవేల వెంబడి వేశ్యలు, హిజ్రాలు సహా చాలా మంది మహిళలను వేధించారట ఈ నిందితులు.