దిశ కేసులో నిందితుడు చెన్నకేశవుల భార్యకి బిడ్డ పుట్టింది

దిశ కేసులో నిందితుడు చెన్నకేశవుల భార్యకి బిడ్డ పుట్టింది

0
91

దిశ కేసులో నిందితుడు చెన్నకేశవులు , పాపం భర్త చేసిన దారుణానికి ఆ భార్య కూడా ఇప్పుడు ఒంటరి
అయింది… అతను ఈ దారుణం చేసే సమయానికి ఆమె గర్భిణీగా ఉంది, మీడియా ముందు ఆమెకు న్యాయం చేయాలి అని కోరింది , పలువురు ఆమెని చూసి దయతలచి సాయం కూడా అందించారు.

అయితే చెన్నకేశవులు భార్య పురుటినొప్పులతో హస్పిటల్ కు చేరింది.. ఈ సమయంలో చెన్నకేశవులు భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది….మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది అని తెలుస్తోంది
ఆడ బిడ్డకు జన్మనిచ్చింది అనే వార్త మీడియాకు తెలిపారు… తల్లీ బిడ్డా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. చెన్నకేశవులుది నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామం.

అయితే అక్కడే స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాని దిశను చంపిన వారిలో అతను కూడా ఒకడు …గతేడాది డిసెంబర్ 6న షాద్నగర్ ఎన్కౌంటర్లో చెన్నకేశవులు మరణించాడు, అప్పటికే అతడి భార్య 6 నెలల గర్భవతి …నేడు ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటుంబం సంతోషంలో ఉంది.