తిరుమలకు పోటెత్తిన భక్తులు..శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

0
121

తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో తిరుమల కొండ నిండా భక్తులతో నిండిపోయింది. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు.

ఇక ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. వైకుంఠము రెండులోని 33 కంపార్ట్మెంట్ లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠము ఒకటి లోని 16 కంపార్ట్ మెంట్‌లో భక్తులు నిండిపోయారు. ఒక్కో కంపార్ట్మెంట్ లో 500 మంది భక్తులు వేచి ఉన్నారు. గంటకు 4 వేల మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు అధికారులు.

మరోవైపు పెరుగుతున్న క్యూలైన్‌తో దాదాపు 4 కిలో మీటర్ల వరకు చేరారు భక్తులు. 7 నారాయణ గిరి షెడ్లలోనూ భక్తులు నిండిపోయారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటంతో.. వసతి సౌకర్యం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. ఇకపోతే, భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 21వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. కాగా, అనూహ్యంగా భక్తులు పోటెత్తడంతో శ్రీవారి సేవా సదన్ వరకు రద్దీ నెలకొంది.