దిశ తండ్రిని బదిలీ చేసిన ప్రభుత్వం

దిశ తండ్రిని బదిలీ చేసిన ప్రభుత్వం

0
101

శంషాబాద్ హత్యాచార బాధితురాలు దిశ కుటుంబానికి దేశ వ్యాప్తంగా మద్దతు వచ్చింది. అయితే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.

దిశ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి , తాజాగా ఆయనని రాజేంద్రనగర్కు బదిలీ చేసింది సర్కార్. 1981-87 మధ్యకాలంలో భారత సైన్యంలో పనిచేసిన ఆయన.. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుమస్తాగా చేరారు. క్రమంగా సీనియర్ అసిస్టెంట్ స్థాయికి వచ్చారు. కాని ఆయన ఉద్యోగం మాత్రం వేరే చోట చేస్తున్నారు.

దీంతో ఆయనకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి.. దిశ తండ్రి కోరిక మేరకు బదిలీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆయనను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
ఇక దిశ చెల్లెలు కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏటీసీలో ఇంజనీర్ గా చేస్తోంది. ఆమెకు ఉదయం పూట మాత్రమే షిప్ట్ వేస్తున్నారు అని తెలుస్తోంది.