మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. అనేక గుహాలు ఉన్నాయి. ఇంకా కొన్ని గుహాల్లో అసలు ఏమి ఉన్నాయో కూడా కొందరు తెలుసుకోలేకపోయారు. అలాంటి గుహాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ ప్రముఖ ప్రాంతం గురించి చెప్పుకుందాం. ఉత్తరాఖండ్ లోని భువనేశ్వర్ అనే గ్రామంలో పాతాళ భువనేశ్వర్ అనే గుహ ఉంది.
ఇక్కడకు ఎవరైనా చేరుకోవాలి అంటే మొత్తం 3 కిలోమీటర్లు నడకతో చేరుకోవాలి. ఇవి చాలా ఇరుకుగా ఉండే గుహాలు. ఇలా ముందుకు నడవడానికి రెండు గొలుసులను పట్టుకుంటూ సుమారు 90 అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది. తన భార్య దమయంతి చేతిలో ఓడిపోయి నలుడు అడవిలో ఉండగా ఈ గుహ కనిపించింది అంటారు. ఈ గుహలు ప్రకృతి సిద్దంగా ఏర్పడ్డాయి. త్రిమూర్తులు, వేయి పడగల శేషుడు, శివుడి జటాజూటం, ఐరావతం ఇవన్నీ కూడా ఈ గుహల్లో ఆకారాల్లో కనిపిస్తాయి.
ఇక ఈ స్ధలపురాణంగా మరో విషయం కూడా చెబుతారు. శివుడు నరికిన వినాయకుడి శిరస్సు ఈ గుహలోనే ఉందని మరో కథనం. ఏనుగు మొండాన్ని తెచ్చేంతవరకు ఈ గుహలోనే వినాయకుని మొండాన్ని ఉంచారని చెబుతారు. పాండవులు కూడా కురుక్షేత్రం తర్వాత ఇక్కడకు వచ్చి తపస్సు చేశారని ఇక్కడ నుంచి కైలాసం చేరుకున్నారు అని అంటారు.