బ్రేకింగ్ — హైదరాబాద్లో మళ్లీ భూప్రకంపనలు- బోరబండలో ఎందుకు ఇలా జరుగుతోంది ?

బ్రేకింగ్ -- హైదరాబాద్లో మళ్లీ భూప్రకంపనలు- బోరబండలో ఎందుకు ఇలా జరుగుతోంది ?

0
100

అందరూ ఇంటిలో ఉన్న సమయం ఒక్కసారిగా రాత్రి సమయంలో భారీ శబ్దాలు భూమి నుంచి రావడంతో భూకంపం వస్తుందా అనే భయం.. ఉన్నా నగదు బంగారం తీసుకుని కుటుంబాలు అన్నీ బయటకు వచ్చేశాయి, చాలా సేపు ఈ శబ్దాలు రావడంతో ఆ కుటుంబాలు అన్నీ కంగారు పడ్డాయి, ఇది ఎక్కడ జరిగిందో తెలుసా హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతంలో.

ఇటీవల తరచుగా ఇక్కడ భారీగా భూమి నుంచి శబ్దాలు వస్తున్నాయి.ప్రతి 5 నిమిషాలకు ఓసారి శబ్దాలు వస్తున్నట్లు వెల్లడించారు ఇక్కడ ప్రజలు… భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 0.8 నమోదయినట్లు ఎన్జీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

భూమి పొరల నుంచి శబ్దాలు వస్తుండడంతో బోరబండ ప్రజల్లో ఆందోళన నెలకొంది. చాలా మంది ఈ ప్రాంతం వదిలి వేరే ప్రాంతాలకు వెళుతుంటే మరికొందరు ఇక్కడే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు..
NGRI అధికారులు బోరబండలోని పలు కాలనీల్లో పర్యటించారు. ఈ శబ్దాలు పరిశోధన కోసం మూడు ప్రాంతాల్లో సిస్మోగ్రాఫ్ పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అసలు ఎందుకు ఇలా అంటే…
బోరబండ ప్రాంతం ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఉండడంతో భూమి లోపలి పొరల్లో ఏర్పడే సర్దుబాట్ల కారణంగానే శబ్దాలు వస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిశాయి, ఈ సమయంలో ఆ నీరు అంతా భూమిలోకి చేరుతుంది..ఆ సమయంలో భూమి పొరల్లో ఉండే గాలి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుందనీ వెల్లడించారు. ఇలా ఒత్తిడి పెరిగిన సమయంలో గాలి వస్తున్న సమయంలో ఇలా శబ్దాలు వస్తున్నాయి అని వెల్లడించారు.. 2017 అక్టోబరులోనూ వరుసగా నెల రోజుల పాటు భూప్రకంపనలు వచ్చాయని స్థానికులు వెల్లడించారు.