దిష కేసులో నిందితుల ఎన్ కౌంట‌ర్ మొత్తం జ‌రిగింది ఇదే

దిష కేసులో నిందితుల ఎన్ కౌంట‌ర్ మొత్తం జ‌రిగింది ఇదే

0
96

దిష కేసులో పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దిశపై హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్ ద‌గ్గ‌ర చ‌టాన్ ప‌ల్లి బ్రిడ్జ్ ద‌గ్గ‌రఎక్క‌డ అయితే దిశ‌ని హ‌త్య చేశారో అక్క‌డే ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. తెల్ల‌వారు జామున మూడు నుంచి నాలుగు గంట‌ల మ‌ధ్య వారిని ఎన్ కౌంట‌ర్ చేశారు అని తెలుస్తోంది

తెల్ల‌వారు జామున మూడు గంట‌ల‌కు నిందితుల‌తో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. వీరు న‌లుగురు తప్పించుకునేందుకు ప్ర‌యత్నిస్తుండగా.. ఎన్‌ కౌంటర్ చేసినట్టు పోలీసులు తెలిపారు
ఆత్మ‌రక్ష‌ణ‌లో భాగంగా కాల్పులు జ‌రిపారు అని తెలుస్తోంది.

దీంతో పోలీసులు చేసిన ప‌నికి అంద‌రూ హ‌ర్షిస్తున్నారు.. వ‌రంగ‌ల్ త‌ర‌హ ఎన్ కౌంట‌ర్ కోరుకున్న వారు అంద‌రూ కూడా ఆనందం వ్య‌క్తం చేశారు, దిశ త‌ల్లిదండ్రులు కూడా చాలా ఆనందంలో ఉన్నారు. త‌మ కుమార్తెకు జ‌రిగిన అన్యాయం మ‌రెవ‌రికి జ‌ర‌గ‌కూడ‌దు అని కోరుకుంటున్నారు.