చాలా మందికి కోట్ల రూపాయల నగదు ఆస్తి ఉన్నా, దానం చేయడంలో వెనకే ఉంటారు… ఏమీ లేని వారు మాత్రం తమ దగ్గర ఉన్న వాటిలో ఎంతో కొంత దానం చేస్తూ ఉంటారు..అయితే పండితులు చెప్పేదాని ప్రకారం దానం చేస్తే ఇంటికి చాలా మంచిది ఆ వ్యక్తికి కుటుంబానికి ఎంతో ధనం వస్తుంది. ధానం చేసిన దానికంటే వంద రెట్లు ప్రతిఫలం వస్తుంది అంటారు పెద్దలు.
ముఖ్యంగా కొన్ని వస్తువుల్ని దానం చేస్తే మరింత ధనవంతులవుతారని చెబుతున్నారు, మరి దానాల్లో ఏది చేస్తే మంచిది అనేది చూద్దాం. గుడి దగ్గర బిక్షం ఎత్తుకునే వారికి పండ్లు నగదు సాయం చేస్తే చాలా మంచిది. ఇంటిలో ఎలాంటి అశాంతి ఉన్నా తొలగిపోతుంది, ఇక బిక్షగాళ్లకి ఏరోజు మా దగ్గర లేదు అని అనకూడదు. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పించే అంశం, మీరు దానం సాయం చేయకపోతే అక్కడ నుంచి వెళ్లిపోవాలి అంతేకాని లేదు అనే మాట మీ నుంచి రాకూడదు.
దానం ఇవ్వాలి అని భావిస్తే పౌర్ణమి ఏకాదశి రోజున ఇత్తడి ఇస్తే చాలా మంచిది.. లేని వారికి ఇత్తడి వస్తువులు దానం ఇవ్వండి. వారికి వంటకి ఉపయోగపడే వస్తువులు ఇచ్చినా ఇంటికి శుభం, ఇలా చేస్తే సంతానం బాగుంటుంది. ఆర్దిక లోటు ఉండదు.
మీరు బియ్యం దానం చేసినా గోదుమలు దానం చేసినా లవంగాలు అందులో పైన వేసి దానం చేస్తే చాలా మంచిది. ధన లాభం ఉంటుంది మీకు, మీరు నిజంగా ధనవంతులు కుబేరులు అయితే పౌర్ణమినాడు 5 గురికి వెండి నాణాలు దానం చేసి పండ్లు ఇస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.