జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రముఖ వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు

0
87

తెలంగాణ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకలు 15 రోజుల పాటు నిర్వహించారు. ఇక హైదరాబాద్ లోని ఆర్టీసీ కాలనీ వనస్తలిపురం పింక్ & బ్లూ స్కూల్ ఆవరణలో ప్రముఖ వాస్తు నిపుణులు ఎఫ్ సిఐ విశ్రాత ఉన్నతాధికారి కృష్ణాదిశేషు పెంటపాటి జాతీయ జెండాను అవిష్కరించారు.

తదనంతరం కృష్ణాదిశేషు మాట్లాడుతూ..స్వాతంత్రం రావడానికి మహాత్మాగాంధీ, చాచానెహ్రూ, సరోజినీనాయుడులాంటి ఎందరో త్యాగాలఫలం అన్నారు. పిల్లలు జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకోడానికి గౌరవమర్యాదలు గుర్తింపు పొందడానికి స్కూల్ తొలిమెట్టు. మనకు జన్మనిచ్చిన తల్లితండ్రులు జ్ఞాన సంపత్హిని ప్రసాదించిన గురువులు సమాజం పట్ల ఎల్లపుడు కృతజ్ఞతాభావనతో ఉండాలన్నారు. తదంతరం ఆటపాటలలో పాల్గొన్న విజేతలకు ముఖ్యఅతిధి కృష్ణాదిశేషు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అనుషారెడ్డి, టీచర్స్, పలువురు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.