Home SPECIAL STORIES రేపు సామూహిక జాతీయ గీతాలాపన..ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ బంద్

రేపు సామూహిక జాతీయ గీతాలాపన..ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ బంద్

0
195

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పోలీసుశాఖ ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర పాలనాశాఖల అధికారులతో ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు సమన్వయం చేసుకోవాలని చెప్పారు.

ట్రాఫిక్‌ జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలాపన కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి, 11.30 గంటలకు ట్రాఫిక్‌ను నిలిపివేయాలని, మైక్‌సిస్టమ్‌ ద్వారా అలారం మోగించాలని తెలిపారు. ప్రతిఒకరూ బాధ్యతగా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని, జాతీయ గీతాలాపన సమయంలో ఎలాంటి శబ్ధాలు లేకుండా, క్రమశిక్షణతో ఆలపించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.