మనలో చాలా మంది అసలు తెలియకుండానే పలు సిమ్స్ తీసుకుంటారు. ఇక ఇంట్లో ఉన్న వారికి కూడా మన పేరు మీదనే సిమ్ తీసుకుంటాం. పాత నంబర్ ను మరచిపోతుంటాం. మన పేరు మీద కొందరు కేటుగాళ్లూ సిమ్ లు తీసుకుంటున్న ఘటనలు చాలా ఉంటున్నాయి. అయితే అసలు మన పేరు మీద ఎన్ని నెంబర్లు ఉన్నాయి అనేది మాత్రం చాలా మందికి తెలియదు.
మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడం ఎలా? అందుకే కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ దానికో అవకాశం కల్పిస్తోంది.. http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ ను ప్రవేశపెట్టింది. ఇందులో మీరు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు ఓటీపీ వస్తుంది.
వచ్చిన ఓటీపీతో లాగిన్ అయి ఆ వివరాలను తెలుసుకోవచ్చు. ఇక అసలు మీ పేరు మీద మీకు తెలియని నెంబర్ల ఏమైనా ఉన్నా, వాటిని వద్దు అనుకుంటే రిపోర్ట్ చేయవచ్చు. ఇలా ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది. మరి ఈ లింక్ చూడండి.
http://tafcop.dgtelecom.gov.in