తెలంగాణ కోవిడ్ బులిటెన్ రిలీజ్ : ఆ 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు, జిల్లాల వారీ లిస్ట్ ఇదే

Today Corona cases Bulletin Released

0
39
Corona Cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. మంగళవారం వెల్లడైన కరోనా బులిటెన్ లో ఒక జిల్లాలో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక సింగిల్ డిజిట్ కేసులు నమోదైన జిల్లాలు ఎనిమిది ఉన్నాయి. మిగతా జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు వచ్చాయి.

మంగళవారం నమోదైన కేసులు 1175 మాత్రమే. సోమవారం నమోదైన 1197 కేసులతో పోలిస్తే జస్ట్ 2 కేసులు తక్కుగా నమోదయ్యాయి. మంగళవారం మరణాల సంఖ్య 10 నమోదైంది. సోమవారం మరణాల సంఖ్య 9తో పోలిస్తే ఒకటి ఎక్కువే నమోదైంది.

జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసిలో మాత్రమే 133 కేసులతో త్రిబుల్ డిజిట్ నమోదైంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సైతం పరిస్థితి ఆశాజనకంగా మారి డబుల్ డిజిట్ కు కేసులు చేరుకున్నాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు 124907 జరిపారు. కోవిడ్ సోకి ఇవాళ కోలుకున్న వారి సంఖ్య 1771గా ఉంది. రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 16640 మాత్రమే ఉన్నాయి. వెయిటింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 820.

మంగళవారం నాడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.

ఆదిలాబాద్ 5
కొత్తగూడెం 70
జిహెచ్ఎంసి 133
జగిత్యాల 32
జనగామ 12
జయశంకర్ భూపాలపల్లి 24
జోగులాంబ గద్వాల 5
కామారెడ్డి 4
కరీంనగర్ 74
ఖమ్మం 76
కొమరం భీం ఆసిఫాబాద్ 3
మహబూబ్ నగర్ 26
మహబూబాబాద్ 51
మంచిర్యాల 41
మెదక్ 9
మేడ్చల్ మల్కాజ్ గిరి 68
ములుగు 28
నాగర్ కర్నూల్ 13
నల్లగొండ 70
నారాయణపేట 7
నిర్మల్ 4
నిజామాబాద్ 7
పెద్లపల్లి 64
రాజన్న సిరిసిల్ల 25
రంగారెడ్డి 74
సంగారెడ్డి 17
సిద్దిపేట 27
సూర్యాపేట 74
వికారాబాద్ 18
వనపర్తి 16
వరంగల్ రూరల్ 23
వరంగల్ అర్బన్ 41
యాదాద్రి భువనగిరి 34

నిన్నటి కరోనా కేసుల వివరాల కోసం కింది వార్త చదవండి…

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు : బులిటెన్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్ లో నేటి కోవిడ్ బులిటెన్ వివరాల కోసం కింద వార్తను చదవండి…

ఎపి కోవిడ్ బులిటెన్ రిలీజ్, తగ్గిన కేసులు : ఇవాళ లిస్ట్ ఇదే, ఆ ఒక్క జిల్లాలో డబుల్ డిజిట్