ఈ కరోనా సమయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరూ… ఎవరు తుమ్మినా దగ్గినా అక్కడ నుంచి పరుగులు పెడుతున్నారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సోకుతుందా అని భయం భయంతో ఉంటున్నారు, అయితే చాలా మందిని ఇది టెన్షన్ పెట్టిస్తోంది.
ఇలాంటి సమయంలో కొందరు యూట్యూబర్స్ ప్రాంక్స్ కూడా చేస్తున్నారు… తాజాగా నగరంలో చాలా రోజులుగా ప్రాంక్ లు చేయని ఓ యువకుడు కరోనా ప్రాంక్ చేద్దాము అని అనుకున్నాడు, నడుస్తూ పక్కన వెళుతూ గట్టిగా తుమ్మి నాకు కరోనా ఉంది తుమ్మాను కదా, మీరు వెళ్లి టెస్ట్ చేయించుకోండి అని సలహా ఇచ్చాడు.
దీంతో ఇద్దరు ముగ్గురు కంగారు పడి పరుగులు పెట్టారు …కాని ఓ వ్యక్తిమాత్రం ఇతని చెంప చెళ్లుమనిపించాడు, వెటకారాలా అని నాలుగు తగిలించాడు, మిగిలిన వారు వచ్చేసరికి సార్ ఇది ప్రాంక్ అని చెప్పాడు, ఈ సమయంలో ప్రాంక్ ఏమిటి అని మరో నాలుగు తగిలించారు, అంతేకాదు పోలీసులకు అప్పగించారు అతనిని, సో అందుకే ఇలాంటి వాటి మీద ప్రాంక్ చేయకండి అని నెటిజన్లు చెబుతున్నారు.