గారాల చెల్లిని గ‌ర్భవ‌తిని చేసిన ప్రియుడు – చివ‌ర‌కు ప్రియుడ్ని ఏం చేశారంటే

గారాల చెల్లిని గ‌ర్భవ‌తిని చేసిన ప్రియుడు - చివ‌ర‌కు ప్రియుడ్ని ఏం చేశారంటే

0
84

ఆడ‌కూతుర్ని ఎవ‌రైనా గారాభంగా పెంచుకుంటారు… ఇక అన్న‌ద‌మ్ములు చెల్లిని అక్క‌ని ఎలా చూసుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు, ఇక ఆమెని ఎవ‌రైనా ఏమైనా అన్నా ఊరుకోరు.. రోడ్డుమీద‌కు తీసుకువ‌చ్చి మ‌రీ కోటింగ్ ఇస్తారు, బుద్దివ‌చ్చేలా వార్నింగ్ ఇస్తారు, అయితే ఏకంగా గారాల చెల్లిని వేరే కులం వ్య‌క్తి ప్రేమించ‌డమేకాదు..

ఏకంగా క‌డుపు కూడా చేశాడు, ఆమె ఆరోనెల గ‌ర్భ‌వ‌తి, దీంతో ఆమె ప్రియుడికి బుద్ది చెప్పాలి అని అనుకున్నారు, ఈ అమ్మాయి ఆమె ప్రియుడు ఒకే కంపెనీలో భాగ్య‌న‌గ‌రంలో ప‌ని చేసుకుంటున్నారు..ఈ స‌మ‌యంలో ప్రేమ చిగురించి పెళ్లి కాకుండా ఒక‌టి అయ్యారు.

ఆ అమ్మాయి ఇప్పుడు 6 నెలల గర్భవతి. ఈ విషయం అమ్మాయి సోదరులకు తెలిసింది. అమ్మాయి సెల్ ఫోన్ నుండి ఆమె సోదరుడు ఆమె పెట్టినట్టే మెస్సేజ్ పెట్టి నిన్ను కలవాలని రమ్మని మెసేజ్ పెట్టాడు. దీంతో అత‌ను వ‌చ్చాడు, వెంట‌నే అత‌నిని చిత‌క‌బాది ఓ బావిలో ప‌డేశారు, కాని అందులో నీరు లేక‌పోవ‌డంతో ఆ యువ‌కుడు బ‌తికాడు, ప‌శువుల కాప‌రి చూసి పోలీసుల‌కు చెప్పి అత‌నిని కాపాడాడు, దీంతో తీగ‌లాగితే ఈ సీన్ బ‌య‌ట‌కు వ‌చ్చింది, ఆమె సోద‌రుల‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.