గర్భంతో ఉండగానే మరో సారి గర్భం ప్రపంచంలో వింత ఘటన

గర్భంతో ఉండగానే మరో సారి గర్భం ప్రపంచంలో వింత ఘటన

0
124

నిజమే ఈ మధ్య అనేక వింత ఘటనలు సంఘటనలు మనం వింటూ ఉన్నాం… తాజాగా ఓ వింత ఘటన జరిగింది, ఇలా ప్రపంచంలో ఇప్పటి వరకూ జరగలేదు అంటున్నారు వైద్యులు, అది ఏమిటి అంటే గర్భంతో ఉన్న ఓ మహిళ, మరో గర్భం దాల్చడంతో పాటు, పండంటి కవలలకు జన్మనివ్వడమే. నిజంగా వినడానికి చదవడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఈ ఘటన ఎక్కడ ఏమిటి అనేది చూద్దాం.

 

 

లండన్ లోని రెబెక్కా రాబర్ట్స్, అతని భాగస్వామి చాలా కాలంగా ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటూన్నారు, మొత్తానికి పిల్లల కోసం ఎంతో ఎదురుచూశారు, చివరకు ఆమె గర్భవతి అయింది. ఇక బిడ్డ బాగానే ఎదుగుతున్నాడు అని తెలిసి చాలా ఆనందించారు. అయితే 12 వారాల తర్వాత మరో వార్త తెలిసింది ఆ జంటకి.

 

రెండోసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ కు వెళ్లిన వేళ, తన భార్య కడుపులో మరేదో ఉందని, అది మరో బిడ్డ కావచ్చని డాక్టర్లు చెప్పారు.. పూర్తిగా అన్నీ పరీక్షలు చేస్తే మరో పిండం అని తేలింది… అది చాలా నెమ్మదిగా ఎదిగింది… ఇది నిజంగా అద్బుతం అని అన్నారు వైద్యులు…ఇలాంటివి అప్పుడప్పుడూ జరగవచ్చు అని తెలిపారు… మొత్తానికి బిడ్డల కండిషన్ పై ఎప్పటికప్పుడు రిపోర్టులు తీసుకున్నారు.. ఇక ఇద్దరికి డేట్లు వేరు కాని ఒకేసారి ఆపరేషన్ చేసి ఇద్దరిని తాశారు.. వారు ఇప్పుడు కవలలుగా పుట్టారు. బిడ్డలు ఇద్దరు తల్లీ క్షేమంగా ఉన్నారు.