రూ.55తో రూ.36 వేల పెన్షన్ పొందండి..ఎలాగంటే?

0
98

తెలంగాణ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలను ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వారి కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలను అమలు చేసి పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పేద కార్మికులు, కూలీలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పెన్షన్​ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో అద్భుతమైన స్కీమ్​ను  అమలు చేస్తోంది.

ఇందులో చేరిన ప్రతి సభ్యునికి కనీస హామీ పెన్షన్ రూ. నెలకు 3వేలు చెల్లిస్తారు.  నెలకు రూ.55 చొప్పున చెల్లిస్తే ఏటా రూ.36 వేల పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పొందేందుకు వీలవుతుంది. ఎక్కువ ప్రీమియం కడితే ఏటా రూ.72 వేలు కూడా పొందవచ్చు. పీఎంఎస్​వైఎంలోని ప్రతి సభ్యునికి 60 ఏళ్ల వయసు దాటాక తర్వాత నెలకు రూ.3వేల చొప్పున పెన్షన్ ఇస్తారు. ఆ లెక్కన, ఒక వ్యక్తి సంవత్సరానికి రూ.36 వేలు పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పొందవచ్చు.

కుటుంబ పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జీవిత భాగస్వామి (భార్య/భర్త) మాత్రమే అర్హులు.  లబ్ధిదారుడు ఏ కారణం వల్లనైనా 60 ఏళ్లు నిండకముందే శాశ్వతంగా వికలాంగుడు అయితే జీవిత భాగస్వామి  ద్వారా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించవచ్చు. ఈ స్కీమ్ లో చేరాలంటే మీకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. నెలవారీ ఆదాయం నెలకు రూ.15 వేలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.