ఐఫోన్లో అమ్మాయి ఫొటోలు లీక్ – భారీ పరిహారం చెల్లించిన యాపిల్

Apple paid huge compensation

0
125

 

ఫోన్ ఏదైనా రిపేర్ కు వస్తే సర్వీస్ సెంటర్ కు తీసుకువెళతాం. అక్కడ టెక్నిషియన్లు ఓ వారం లేదా నాలుగు రోజులు సమయం పడుతుంది అంటే, ఆ ఫోన్ వారికి ఇస్తాం. కాని ఈ సమయంలో కొందరు ఇంపార్టెంట్ డేటా అందులోనే ఉంచేస్తారు. ఇలాంటి డేటాని కొందరు సర్వీస్ సెంటర్ ఉద్యోగులు దొంగిలించి వారిని ఏడిపిస్తూ ఉంటారు. మరికొందరు సోషల్ మీడియాలో పెడతారు.

అమెరికాలోని ఒరేగావ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని ఐఫోన్ పాడైపోవడంతో, 2016లో పెగట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న ఐఫోన్ సర్వీస్ సెంటర్లో బాగుచేయాలని ఇచ్చింది. అయితే అక్కడ టెక్నిషియన్లు ఆ ఫోన్ లో డేటా అంతా చూశారు. ఆ అమ్మాయి నగ్న ఫోటోలు, వీడియోలు దొంగిలించారు.

వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె స్నేహితులు చూసి ఆమెకి ఈ విషయం చెప్పారు. ఆమె దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి, కోర్టుకి వెళ్లింది. పరిహారంగా 5 మిలియన్ డాలర్లు రూ. 36 కోట్లు ఇప్పించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో యాపిల్ ఆ మొత్తాన్ని యువతికి పరిహారంగా చెల్లించింది.