ఏంటి ఒక గొర్రె ధర రెండు కోట్లా.. ! చెప్పేది ప్రతీదీ నమ్మటానికి మేము ఏమైనా గొర్రెలమని అనుకుంటున్నారా అని కోప్పడకండి. ఆ గొర్రెకున్న ప్రత్యేకతల వల్ల అది అంత రేటు పలికింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలైట్ జాతికి చెందిన ఈ గొర్రెను.. వేలం పాటలో ఆస్ట్రేలియన్ వైట్ సిండికేట్‌కు చెందిన వ్యక్తులు రెండు కోట్లకు దక్కించుకున్నారు. దీనికి ఇంత ధర ఎందుకంటే.. ఈ ఎలైట్ జాతికి చెందిన గొర్రెకు జన్యుపరంగా ఉండే వ్యాధినిరోధకత శక్తి అంట. ఈ గొర్రె ఇమ్యూనిటి పవర్ చాలా ఎక్కువుగా ఉండటంతో పాటు.. అతి వేగంగా ఎదుగుతుంది. పైగా ఈ గొర్రెలపై బొచ్చు ఎక్కువుగా ఉండదు. అందువల్ల మాంసం తూకం కూడా ఎక్కువ వస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతోనే ఈ గొర్రె రెండు కోట్లకు వేలంలో కొన్నారు. తన గొర్రె అత్యధిక ధరకు అమ్ముడు కావటం పట్ల గ్రాహం గిల్మోర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రెండు కోట్లకు తన గొర్రె అమ్ముడవ్వటం తనకు నమ్మలేని నిజంగా ఉందంటూ ఆనందంగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ గొర్రె ధర ఆస్ట్రేలియాలో సంచలనంగా మారింది.