బీటెక్ పాస్ అయిన వారికి శుభవార్త..ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..

Good news for BTech students.. Jobs in ECIL..Full details ..

0
44

బీటెక్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ECIL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చింది. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 21 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేస్తుంది. బీఈ, బీటెక్‌ చేసిన వారు అర్హులు.

మొత్తం పోస్టులు: 300 కాగా ఇందులో జనరల్‌ 136, ఈడబ్ల్యూఎస్‌ 15, ఓబీసీ 77, ఎస్సీ 50, ఎస్టీ 22 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెటేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో 60 మార్కులతో బీఈ లేదా బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏడాది అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 30 ఏండ్లలోపు వారై ఉండాలి.

అనుభవం- అభ్యర్థులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. అందులో కనీసం ఆరు నెలలు ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి.

వయస్సు- 2021 నవంబర్ 30 నాటికి 30 ఏళ్ల లోపు

వేతనం- మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నుంచి ఐదో ఏడాది వరకు నెలకు రూ.31,000. అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం- బీఈ లేదా బీటెక్‌లో వచ్చిన మార్కులు, అనుభవం ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించనున్న ఈసీఐఎల్.

కాంట్రాక్ట్ గడువు- ఒక ఏడాది. ఐదేళ్ల వరకు కాంట్రాక్ట్ గడువు పొడిగించే అవకాశం ఉంది.

వెబ్‌సైట్‌: http://careers.ecil.co.in