శ్రీవారి భక్తులకు తీపికబురు..ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల

0
112

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో దర్శించుకుంటున్నారు. తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి గుడ్ న్యూస్ చెప్పింది.

ఇవాళ ఈనెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల(రూ.300)ను రేపు టీటీడీ విడుదల చేయనుంది. రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్‌ కోటా చెందిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే ఈ రోజు ఉదయం 9 గంటలకు 12, 15,17 తేదీలకు చెందిన రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.

ఇదిలా ఉంటే..నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.6 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.. విరాళాలు రూ.6.18 కోట్లుగా తెలిపింది. ఇప్పటిదాకా 2012 ఏప్రిల్ 1న తిరుమల వెంకన్న హుండీకి ఒకరోజు అత్యధికంగా లభించిన ఆదాయం రూ.5.73 కోట్లు. ఇప్పుడు మొట్టమొదటిసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటింది.. ఇప్పుడు 2012 రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది.